నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద ముద్దునూరు వద్ద అతివేగంగా దూసుకొచ్చిన కారు.. గాలిలో పల్టీలు కొడుతూ బీభత్సం సృష్టించి ఒకరిని బలితీసుకుంది. కారు సృష్టించిన బీభత్సానికి లక్ష్మమ్మ(40)అనే మహిళ మృతిచెందగా డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నాగర్ కర్నూల్ నుండి కొల్లాపూర్ వైపు అతివేగంగా వెళుతున్న కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పింది. అతివేగంగా ఉండడంతో కారు రోడ్డుపై నుండి పల్టీలు కొడుతూ పక్కనే నడుచుకుంటూ వెళుతున్న భోగరాజు లక్ష్మమ్మ అనే మహిళ పైకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడ్డ కారు డ్రైవర్‌ను అంబులెన్స్ లో నాగర్ కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సంఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.