తెలంగాణ అసెంబ్లీఎన్నికల్లో ఓటమిపాలై అధికారంలో కోల్పోయిన బీఆర్‌ఎస్ పార్టీ నుంచి పలువురు నేతలు అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీలోకి క్యూ కడుతున్నారు. అయితే తాజాగా మరో నేత బీఆర్‌ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రటించారు. మాజీ సీఎం,బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్‌కు తన రాజీనామా లేఖ పంపారు సుభాష్ రెడ్డి. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగాబరిలో ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు మద్దతు ఇవ్వనున్నట్లు బేతి సుభాష్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ పలువురు కీలక నేతలు బీఆర్‌ఎస్‌ను వీడటం ఆ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నగేందర్ ఇటీవల బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేశారు. వారితో పాటు సీనియర్ నేతలు కే. కేశవరావు, పట్నం మహేందర్‌రెడ్డి వంటి పలువురు కీలక నేతలు కూడా బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి అధికార కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. కీలక పార్టీ నేతలు వీడడంతో బీఆర్ఎస్ కి తలనొప్పిగా మారింది.
బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారిన నేతల తీరు
0
426
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


