అందుకే అలా చేశా.. దయచేసి నన్ను క్షమించండి- మంత్రి తలసాని

స్వతంత్ర వెబ్ డెస్క్: స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్ సందర్భంగా జరిగిన సంఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Thalsani srinivas yadav) స్పందించారు. భైంసా ఏఎంసీ చైర్మన్ రాజేష్ బాబుకు(Rajesh Babu), గిరిజన సమాజానికి శుక్రవారం మంత్రి క్షమాపణలు చెప్పారు. కేటీఆర్(KTR) వచ్చిన సందర్భంగా ఎక్కువ రద్దీ ఏర్పడిందని, ఓ వ్యక్తి నా కాలు తొక్కుతూ ముందుకెళ్లాడటంతో నా కాలుకు గాయమై రక్తమొచ్చిందని, ఆ సందర్భంగానే ఆ వ్యక్తిని నెట్టి వేశాను అన్నారు. సోషల్ మీడియాలో దీన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అతను బైంసా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ కుమార్ బాబు అని తెలిసిందని వెంటనే క్షమాపణలు చెప్పినట్లు వెల్లడించారు. ఆయన గిరిజన బిడ్డా అని తెలిసిన వెంటనే ఆయనకు ఫోన్ చేసి సారీ చెప్పానని, నేను బడుగు బలహీన దళిత, మైనార్టీ గిరిజన వర్గాల గొంతుకను అని చెప్పుకొచ్చారు. తెలంగాణలో జరిగే సేవాలాల్, కొమురం భీం జయంతి కార్యక్రమాలు ముందుండి చేస్తానని, ఆరోజు జరిగిన ఘటనపై వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే క్షమాపణ చెప్పుతున్న అని పేర్కొన్నారు. బేషజాలకు పోవాల్సిన పరిస్థితి కాదని, దయచేసి అన్యతగా భావించవద్దని విజ్ఞప్తి చేశారు. గిరిజన సమాజానికి మరోసారి క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్