విశాఖ స్టీల్ ఫ్యాక్టరీపై కేంద్రం చెప్పేవన్నీ అబద్ధాలేనని అన్నారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని దివాలా తీయించే ఎత్తుగడలు సాగుతున్నాయన్నారు. ప్రధాని మోదీ దోస్తులకు అమ్మే కుట్రలు జరుగుతూనే ఉన్నాయని ఆరోపించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఉద్ధరిస్తున్నామని కేంద్రం చెప్తున్నవన్నీ అసత్యాలేనని.. స్టీల్ ప్లాంట్ మీద కేంద్రానిది సవతి తల్లి ప్రేమేనని విమర్శించారు. కన్నడ ఉక్కు మీదున్న ప్రేమ.. ప్రధాని మోదీకి ఆంధ్రుల హక్కు మీద లేదన్నారు షర్మిల.