IND vs AUS Test | చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. ఆస్ట్రేలియా టార్గెట్ 76 పరుగులే

IND vs AUS Test |బోర్డర్-గవస్కర్ ట్రోఫిలో భాగంగా జరుగుతున్న మూడవ టెస్టులో టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులకే ఆలౌట్ అయిన భారత్.. రెండవ ఇన్నింగ్స్ లోనూ 163 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో ఆస్ట్రేలియాకు 76 పరుగుల స్వల్ప లక్ష్యం లభించింది. రెండవ రోజు ఓవర్ నైట్ స్కోర్ 156/4తో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ మరో 41 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది.

భారత బౌలర్లలో జడేజా(jadeja) 4, ఉమేశ్(umesh) యాదవ్, అశ్విన్(ashwin) చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 88 పరుగుల వెనుకంజతో రెండవ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ సేన.. ఆసీస్ స్పిన్నర్ల ధాటికి విలవిలలాడిపోయింది. ముఖ్యంగా సీనియర్ స్పిన్నర్ నాథన్ లయన్(lyon) బౌలింగ్ లో తెగ ఇబ్బందిపడిపోయింది. ఏకంగా 8 వికెట్లు తీసి భారత్ ను కోలుకోలేని దెబ్బ తీశాడు. దీంతో 163 పరుగులకే 10 వికెట్లు కోల్పోయింది. భారత బ్యాటర్లలో పూజారా(pujara) 59, అయ్యర్(iyer) 26 పరుగులతో రాణించారు. ఆసీస్(ausis) గెలవాలంటే 76 పరుగులు చేస్తే సరిపోతుంది. దీంతో కంగారు జట్టు గెలుపు ఖాయంగానే కన్పిస్తోంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప భారత్(india) గెలవడం అసాధ్యమనే చెప్పాలి.

Read Also: తెలంగాణలో మరో దిగ్గజ సంస్థ పెట్టుబడులు.. లక్ష మందికి ఉపాధి

Follow us on: Youtube

Latest Articles

మీనాక్షి సెంటిమెంట్ మళ్లీ నిజమయ్యేనా..?

ఒక్కొక్కరికి ఒక్కొ సెంటిమెంట్ ఉంటుంది.. అదే సినీ జనాలకు అయితే.. ఈ సెంటిమెంట్ కాస్త ఎక్కువుగానే ఉంటుంది. మేటర్ ఏంటంటే.. ఇండస్ట్రీలో మీనాక్షి సెంటిమెంట్ ఒకటి ఉంది. దీంతో యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్