Snoozing Alarm: అలారం మోగుతున్నా నిద్రలేవడం లేదా.. ఈ చిట్కాలు మీ కోసం..

Snoozing Alarm: అలారం.. గతంలో అలారం మోగే గడియారాలు ప్రత్యేకంగా ఉండేవి.. తప్పనిసరిగా సమయపాలన పాటించేవాళ్లు.. పలానా టైమ్‌కి లేవాలనుకునేవాళ్లు వీటిని ఉపయోగించేవాళ్లు. తరువాత కాలంలో మొబైల్‌ ఫోన్ల వాడకం విస్తృతం కావడం, ఫోన్లలో అలారం సదుపాయం ఉండటంతో అందరూ ఫోన్లలో అలారం పెట్టుకుని నిద్రపోతుంటారు. అయితే అలారం అయితే పెట్టుకుంటారు కాని.. అది మోగే టైమ్‌కు కొందరు లేచినా.. మరికొందు మాత్రం లేచి.. అలారం ఆఫ్‌ చేసి పడుకుంటూ ఉంటారు. అందుకే ఇంట్లో వాళ్లు కూడా.. ఈ మాత్రం దానికి అలారం పెట్టుకోవడం ఎందుకని అంటూ ఉంటారు. అలారం మోగుతున్నా.. చాలామంది లేవకుండా నిద్రపోతూనే ఉంటారు. కొంత సమయం అయ్యాక లేచి.. అయ్యో నాకు స్కూల్‌కు, కాలేజ్‌కు లేదా ఆఫీసుకు టైమ్‌ అయిపోతుందంటూ కంగారు కంగారుగా రెడీ అవుతూ ఉంటారు. కొన్నిసార్లు అయితే టైమ్‌ కూడా దాటిపోతుంది. ముఖ్యంగా అలారం పెట్టుకున్న టైమ్‌కు లేవకుండా.. అలారాన్ని స్నూజ్‌ చేసి పడుకుంటూ ఉంటారు. ఈ రకంగా చేయడానికి ప్రధాన కారణం.. నిద్ర మత్తు వదలకపోవడం అయితే.. నిద్రపోయే విషయంలో సమయపాలన పాటించకపోవడమే ప్రధాన కారణం. చాలా మంది ఉదయం త్వరగా లేవాలనుకుంటారు. దానికి తగినట్లు కొందరైతే రాత్రి సమయంలో త్వరగా నిద్రపోతారు. కాని మరికొందరు రాత్రి ఆలస్యంగా పడుకుని.. ఉదయం లేవాలనుకుంటారు.. అలాంటి వాళ్లకు నిద్ర సరిపోకపోవడంతో అలారాన్ని స్నూజ్‌ చేస్తూ.. లేవడానికి బద్దకిస్తూ ఉంటారు.

రాత్రి నిద్రపోయే సమయంలో ఎక్కువ సేపు మొబైల్‌ ఫోన్లు చూస్తూ.. స్క్రీన్‌కు అతుక్కుపోవడం వలన ఆ ప్రభావం కంటిపై పడుతుంది. దీంతో ఉదయం లేవడానికి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందుకే అలారం మోగే సమయానికి లేవాలనుకునే వారు తప్పనిసరిగా రాత్రి త్వరగా నిద్రపోవాలి. ఓ వ్యక్తి సాధారణంగా కనీసం 6గంటలు.. గరిష్టంగా 8 గంటలకు మించకుండా నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది.. ఈ సమయాన్ని అంచనా వేసుకుని.. లేవాలనుకునే సమయానికి 8 గంటల ముందుగానే నిద్రపోవాల్సి ఉంటుంది. అలా నిద్ర పోవడం వలన అలారం మోగే సమయానికి లేస్తారు. మరోవైపు స్నూజ్‌ ఆప్షన్‌ ఎక్కువసార్లు ఉపయోగించడం ద్వారా అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అలారాన్ని స్నూజ్‌ చేయడం కోసం తరచూ లేవడం, పడుకోవడం చేస్తూ ఉంటారని, దీని ద్వారా శరీరానికి అవసరమైన విశ్రాంతి లభించదంటున్నారు. సరైన విశ్రాంతి లేకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందంటున్నారు. అందుకే సమయానికి నిద్రపోవడం, పడుకునే ముందు మొబైల్‌ స్క్రీన్లకు అతుక్కుపోయే అలవాటును తగ్గించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Latest Articles

పులివెందులను కాపాడుకోవడానికి వైఎస్ జగన్ ఏం చేయబోతున్నారు?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే పులివెందుల నియోజకవర్గం ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఆ గడ్డపై, ఇప్పుడు ఆధిపత్య పోరు రసవత్తరంగా మారుతోంది. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్