27.2 C
Hyderabad
Wednesday, February 4, 2026
spot_img

రియాక్టర్‌ పేలిన ఘటనలో ఆరుగురు మృతి

    సంగారెడ్డి జిల్లా కెమికల్ రియాక్టర్‌ పేలుడు ఘటనలో బాదితుల కుటుంబాలను మాజీ మంత్రి హరీశ్‌ రావు పరామర్శించారు. బాధితులతో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. మరోవైపు SB కెమికల్‌ ఫ్యాక్టరీలో పేలుడు ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. నిన్న SB కెమికల్‌ ఫ్యాక్టరీలో రియాక్టర్‌ పేలడంతో ఐదుగురు మృతి చెందారు. శిథిలాలు తొలగిస్తుండగా మరో మృతదేహం లభ్యమైంది. మృతుడిని కోన్యాలకు చెందిన వడ్డేపల్లి రమేశ్‌గా గుర్తించారు. మరోవైపు ఈ ఘటనలో గాయపడిన 25 మందికి హైదరాబాద్‌లోని నిమ్స్, కేర్‌ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యంపై బాధిత కుంటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇంత మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని అంటున్నారు.

SB ఆర్గానిక్స్‌ యూనిట్‌-1లో కాలంచెల్లిన రియాక్టర్లను ఉపయోగించడం వల్లే ప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. దశాబ్దాల క్రితం నిర్మించిన భవనంతో పాటు బాయిలర్‌ కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరినట్లు గుర్తించారు. ఇటీవలే బాయిలర్‌ వద్ద నామమాత్రపు మరమ్మతులు చేసినా..సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణమని కార్మికులు అంటున్నారు. కేవలం నెల రోజుల వ్యవధిలో 9 మంది మృతి చెందినట్లు తెలిపారు. జిల్లాలో ఉన్న 24 పారిశ్రామిక వాడల్లో గత రెండేళ్ల వ్యవధిలో 40 ప్రమాదాలు జరిగాయని పోలీసులు చెప్పారు. రెండేళ్లలో 72 మంది కార్మికులు మృతి చెందగా.. 225 మందికి గాయాలు అయ్యాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్