బెంగాల్‌లో బీజేపీ చారిత్రాత్మక విజయం.. నెక్ట్స్‌ సీఎం ఎవరు?

పశ్చిమ బెంగాల్‌లో నూతన అధ్యాయం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్‌ ప్రజలు బీజేపీకి చారిత్రాత్మక విజయం అందించారు. దశాబ్దాల కాలంగా కమ్యూనిస్టులు, ఆపై టీఎంసీకి కంచుకోటగా ఉన్న బెంగాల్‌ను కైవసం చేసుకోవడం ద్వారా బీజేపీ తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకుంది. అయితే.. ఇప్పుడు అందరి దృష్టి తదుపరి సీఎం ఎవరనే దానిపైనే నెలకొంది.

బెంగాల్‌లో మహిళల భద్రతను బీజేపీ ప్రధానాంశంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో, ఒక మహిళా నేతను సీఎంగా నియమించి తన మహిళా పక్షపాతి ముద్రను మరింత బలోపేతం చేసుకోవాలని పార్టీ భావిస్తోంది. ఫ్యాషన్ డిజైనర్ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన అగ్నిమిత్ర, అసన్సోల్ సౌత్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పనిచేసిన అనుభవం, మమతా బెనర్జీపై ఆమె చేసే పదునైన విమర్శలు ఆమెను రేసులో ముందుంచాయి. మహాభారత్ సీరియల్‌లో ద్రౌపది పాత్రతో ఇంటింటికీ పరిచయమైన రూపా గంగూలీకి పట్టణ ఓటర్లలో మంచి ఆదరణ ఉంది. మాజీ రాజ్యసభ సభ్యురాలిగా, మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పనిచేసిన ఆమె, సోనార్‌పూర్ దక్షిణ నియోజకవర్గం నుంచి గెలిచి బలమైన అభ్యర్థిగా నిలిచారు.

సీఎం రేసులో మహిళలతో పాటు పురుషులు కూడా పోటీలో ఉన్నారు.మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా ఉండి, తర్వాత ఆమెనే నందిగ్రామ్‌లో ఓడించిన ఘనత సువేందుది. క్షేత్రస్థాయిలో బలమైన పట్టు, బలమైన సంస్థాగత నెట్‌వర్క్ ఆయనకు ప్రధాన బలాలు. అయితే, గతంలో ఆయనపై ఉన్న నారద స్టింగ్ ఆపరేషన్ వంటి ఆరోపణలు ఒక చిన్న ప్రతికూలతగా మారవచ్చు. బెంగాల్‌లో బీజేపీ వేళ్లూనుకోవడానికి కారణమైన నేతల్లో దిలీప్ ఘోష్ ఒకరు. ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం ఉన్న ఈయన, తన దూకుడు స్వభావంతో పార్టీ కేడర్‌లో మంచి జోష్ నింపుతారు. అయితే, కొన్నిసార్లు ఆయన చేసే వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంటుంది.

ఇక ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సమిక్ భట్టాచార్య అందరినీ కలుపుకుని పోయే నేతగా ఆయనకు పేరుంది. తెరవెనుక ఉండి పార్టీ విస్తరణకు కృషి చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. ఇతని పేరు కూడా వినిపిస్తోంది. బీజేపీపై ఆశయాలను ముందుకు తీసుకెళ్లే సమర్థవంతమైన నాయకుడి కోసం అన్వేషణ సాగుతోంది. ఢిల్లీలో రేఖా గుప్తాలాగే, బెంగాల్‌లో కూడా ఒక మహిళకు పట్టం కడతారా? లేక సువేందు అధికారి వంటి పక్కా రాజకీయ నేతను ఎంచుకుంటారా? అనేది తేలాల్సి ఉంది. ఎవరు సీఎం అయినా బెంగాల్ లో చరిత్ర స్పష్టించిన వారిలో ఒకరిగా ఉంటారు.

Latest Articles

మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో ఘటన… ఆలయం మండపం కూలి నలుగురు మృతి

మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. యశ్వాడి గ్రామంలోని ఓ దేవాలయం మండపం (బయటి హాలు) పైకప్పు కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యయి. సుమారు 20 మంది భక్తులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్