బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి షాక్ తగిలింది. బఫర్ జోన్లో అనురాగ్ యునివర్సిటీ నిర్మించారని ప్లలాపై కేసు నమోదు అయింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని వెంకటాపురంలో ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ బఫర్ జోన్‌లో నిర్మించారని పోచారం పీఎస్‌లో ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ఎగ్జిక్యూటీవి ఇంజినీర్ పరమేశ్వర్ ఫిర్యాదు చేశారు. బఫర్ జోన్‌లో యూనివర్సిటీ నిర్మించారని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. చెరువులు ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలుపైకి ఓ వైపు హైడ్రా బుల్డోజర్లు తీసుకువెళ్తున్న క్రమంలో తాజాగా బీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఫిర్యాదు నమోదు కావడం ఆసక్తికర పరిణామంగా మారింది.