సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ట్రైన్ షెడ్యూల్ విడుదల

తెలుగు రాష్ట్రాల్లోని శ్రీవారి భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ రైలును నడపనున్నట్లు తెలిపింది. ఇప్పటికే సికింద్రాబాద్-వైజాగ్ మధ్య వందే భారత్ రైలు నడస్తుండగా.. తాజగా సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ రైలును ప్రవేశపెట్టనున్నారు. ఈనెల 8వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ ఈ రైలును ప్రారంభించనున్నారు. అయితే ఆ రోజు ప్రయాణికులను అనుమతించరు. 9వ తేది నుంచి ప్రయాణికులను అనుమతిస్తారు. మంగళవారం తప్ప మిగతా రోజుల్లో సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు తిరగనుంది.

సికింద్రాబాద్-తిరుపతి(ట్రైన్ నెంబర్ 20701) సికింద్రాబాద్‌లో ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. మధ్యలో నల్లగొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు రైల్వే స్టేషన్లలో మాత్రమే ఈ ట్రైన్ ఆగనుంది. నల్లగొండకు ఉదయం 7.19గంటలకు, గుంటూరుకు ఉదయం 9.45గంటలకు, ఒంగోలుకు 11.08గంటలకు, నెల్లూరుకు మధ్యాహ్నం 12.29 గంటలకు చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో తిరుపతి-సికింద్రాబాద్(ట్రైన్ నెంబర్ 20702) తిరుపతిలో మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి రాత్రి 11.45కు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ ట్రైన్ సాయంత్రం 5.20 గంటలకు నెల్లూరు, 6.30కు ఒంగోలు, 7.45కు గుంటూరు, రాత్రి 10.10 గంటలకు నల్లగొండ చేరుకోనుంది.

Latest Articles

బేగంపేట్ రైల్వేస్టేషన్‌లోకి వర్షం నీరు

హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి బేగంపేట్‌ రైల్వే స్టేషన్ లోపలకు వర్షం నీరు చేరింది. వర్షం నీళ్లు లోపలికి చేరడంతో ప్రయాణికులు, స్టాఫ్ ఇబ్బందులు పడ్డారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్