సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు ధరలు ప్రకటన

తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందేభారత్ రైలు పట్టాలెక్కనుంది. సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే వందేభారత్ రైలును ప్రధాని మోదీ శనివారం ఉదయం జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో మాత్రమే ఆగనుంది. సికింద్రాబాద్‌-తిరుపతి(20701) రైలు సికింద్రాబాద్‌లో ఉదయం 6గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2.30గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఇక తిరుపతి-సికింద్రాబాద్‌(20702) రైలు తిరుపతిలో మధ్యాహ్నం 3.15గంటలకు బయల్దేరి రాత్రి 11.45గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోనుంది. మంగళవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో ఈ రైలు తిరగనుంది. ఈ రైలు టికెట్ ధరలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

చైర్ కార్ ధరలు   

సికింద్రాబాద్-నల్గొండ:రూ.470, సికింద్రాబాద్-గుంటూరు:రూ.865, సికింద్రాబాద్-ఒంగోలు:రూ.1075, సికింద్రాబాద్-నెల్లూరు:రూ.1270,  సికింద్రాబాద్- తిరుపతి:రూ.1680గా ధర ఉంది.

ఎగ్జిక్యూటివ్‌ ఛార్జీల ధరలు

సికింద్రాబాద్-నల్గొండ:రూ.900, సికింద్రాబాద్-గుంటూరు:రూ.1620, సికింద్రాబాద్-ఒంగోలు:రూ.2045, సికింద్రాబాద్-నెల్లూరు:రూ.2455,  సికింద్రాబాద్-తిరుపతి:రూ.3080గా ధర ఉంది.

అయితే తిరుపతి నుంచి సికింద్రాబాద్ వచ్చేటప్పుడు రైలు ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి.

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్