స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా రాయలసీమ యూనివర్సిటీలో అక్రమాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.64 లక్షలు సొంత ఖాతాకు మళ్లించారని ప్రొఫెసర్ రాణిని విధుల నుంచి తొలగించారు ఉన్నతాధికారులు. నకిలీ సర్టిఫికెట్లతో 10 మంది ఉద్యోగాలు పొందారనే ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. దీనిపై సీఐడీ విచారణకు ఆదేశం ఇచ్చారు. విచారణ అనంతరం పూర్తి అవకతవకలు బయటకు రానుంది.