రష్మిక చేతుల మీదుగా ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ నుంచి పాట విడుదల

స్వతంత్ర వెబ్ డెస్క్: సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తోన్న చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. చిన్న సినిమాగా మొదలైన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయబోతోంది. మైక్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కంప్లీట్ కామికల్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమాలో బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని జూలై 21న రిలీజ్ చేయబోతోన్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ నుంచి అదిరిపోయే పాటను మేకర్లు రిలీజ్ చేశారు. యూ ఆర్ మై డీపీ అంటూ సాగే ఈ పాటను నేషనల్ క్రష్ రష్మిక మందాన్న రిలీజ్ చేశారు. ఈ పాటను శ్రోతలను ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. సురేష్ గంగుల రాసిన ఈ పాట, భీమ్స్ ఇచ్చిన బాణీ ఎంతో క్యాచీగా ఉంది. సాయి మాధవ్, స్వాతి రెడ్డిలు ఆలపించిన ఈ పాట అందరినీ అలరించేలా ఉంది. ఇక ఈ పాటలో సంజయ్ రావు స్టైలింగ్, ఆయన వేసిన స్టెప్పులు, ప్రణవి మానుకొండ లుక్స్ బాగున్నాయి. చూస్తుంటే ఈ లిరికల్ వీడియోలో యూట్యూబ్‌లో కచ్చితంగా ట్రెండ్ అయ్యేట్టుగా ఉంది. ఈ మూవీలో బ్రహ్మాజీ, సప్తగిరి, ఛమ్మక్ చంద్ర, గుండు సుదర్శన్, ఫిష్ వెంకట్, తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

Latest Articles

లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్‌ జెయిట్స్ జట్టు కెప్టెన్‌ నుంచి రిషబ్‌ పంత్‌ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్‌ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్‌ మీడియా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్