రాజస్థాన్‌ రాయల్స్ Vs కోల్‌కతా నైట్‌రైడర్స్‌

నేడు ఐపీఎల్‌లో అగ్ర జట్ల మధ్య మరో ఆసక్తికర సమరం జరగనుంది. అగ్రస్థానంలో ఉన్న కోల్‌కత్తా, రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. రాత్రి 7 గంటల 30 నిమిషాలకు అస్సాం లోని బర్సపరా స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శనలతో రెండు జట్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి. కోల్‌కత్తా అగ్రస్థానంలో ఉండగా, రాజస్థాన్‌ పట్టికలో రెండో స్థానంలో ఉంది.

కోల్‌కత్తాకు బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉంది. సునీల్ నరైన్ దూకుడుగా ఆడుతున్నాడు. శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రఘువంశీ, రమణదీప్ సింగ్, రింకూ సింగ్ వంటి బ్యాటర్లు ఉన్నారు. కోల్‌కత్తాకు ఆండ్రీ రస్సెల్ ఉన్నాడు. మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, వైభవ్ అరోరాలతో కోల్‌కత్తాకు బలమైన బౌలింగ్ ఉంది.ఇక రాజస్థాన్ జట్టు కూడా బ్యాటింగ్, బౌలింగ్‌లో బలంగా ఉంది. కోల్‌కత్తాతో జరిగిన ఓ మ్యాచ్‌లో జోస్ బట్లర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఓటమి ఖాయమని అనుకున్న మ్యాచ్‌లో వీరోచిత శతకంతో ఒంటి చేత్తో రాజస్థాన్‌కు విజయం అందించాడు. మిగతా బ్యాటర్‌లు ఎవరూ మద్దతు ఇవ్వకపోయినా చివరి వరకు క్రీజ్‌లో నిలిచి తన జట్టును గెలిపించాడు. ఇప్పటి వరకూ ఐపీఎల్‌లో కోల్‌కత్తా, రాజస్థాన్‌ 29 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో కోల్‌కత్తా 14 విజయాలు నమోదు చేయగా రాజస్థాన్‌ 14 విజయాలు నమోదు చేసింది. ఒక మ్యాచులో ఫలితం తేలలేదు. సమవుజ్జీలుగా ఉన్న ఈ జట్ల మధ్య ఫలితం మరింత రసవత్తరంగా మారింది.

Latest Articles

రికార్డులు తిరగరాయడం టీడీపీకే సాధ్యం- చంద్రబాబు

వర్చువల్‌ మహానాడు చరిత్ర సృష్టించిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కార్యకర్తే అధినేత అనేది మహానాడు సందేశమని చెప్పారు. తెలుగు ప్రజల గుండెచప్పుడు ఎన్టీఆర్‌ అని.. NTRకు భారతరత్న ఇవ్వాలని మహానాడులో తీర్మానం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్