అల్వాల్‌లో నకిలీ ఫార్మా ఎక్సిపియెంట్స్ దందా.. రూ.70.56 లక్షల విలువైన స్టాక్‌ సీజ్‌

అల్వాల్‌లో ఫార్మాస్యూటికల్ ఎక్సిపియెంట్లపై అక్రమ లేబుల్ ట్యాంపరింగ్ వ్యవహారాన్ని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు బట్టబయలు చేశారు. జూన్ 12న ఆల్వాల్‌లోని డీకే ఫార్మాస్యూటికల్స్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. ఈ దాడెలంలొ 12 డ్రమ్‌లలో నిల్వ ఉంచిన 240 కిలోల Hydroxypropyl Betadex USP/NF స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న స్టాక్‌పై నకిలీ తయారీదారు వివరాలు, తప్పుడు తయారీ చిరునామాతో లేబుళ్లు అతికించినట్లు గుర్తించారు.

సంగారెడ్డి జిల్లా పాశమైలారం EPIPలో ఉన్నట్లు చూపిన తయారీ యూనిట్ వాస్తవానికి లేదని విచారణలో తేలింది. డీకే ఫార్మాస్యూటికల్స్ భాగస్వాములు సతీష్ బాబు ధూలపల్లి, నాగస్వామి కత్రగడ్డ అసలు లేబుళ్లను తొలగించి నకిలీ లేబుళ్లు అతికించినట్లు అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న ఫార్మాస్యూటికల్ ఎక్సిపియెంట్ల విలువ సుమారు రూ.70.56 లక్షలు. ఈ పదార్థం ఔషధాల తయారీలో ద్రావణీయత, స్థిరత్వం పెంచేందుకు ఉపయోగించే ఎక్సిపియెంట్‌గా వినియోగిస్తారు. నమూనాలను సేకరించి విశ్లేషణకు పంపిన అధికారులు, కేసుపై మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం-1940 ప్రకారం ఈ తరహా నేరాలకు గరిష్ఠంగా 5 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని డీసీఏ తెలిపింది. మందులు, మాదకద్రవ్యాలకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలపై ఫిర్యాదుల కోసం DCA టోల్‌ఫ్రీ నంబర్ 1800-599-6969ను ప్రజలు వినియోగించాలని అధికారులు సూచించారు.

Latest Articles

హీరో విజయ్‌ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు

హీరో విజయ్‌ దేవరకొండకు తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్‌ను ప్రమోట్‌ చేయడంపై నోటీసులు ఇచ్చింది.  HCA టీజీ20 లీగ్‌కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్