30.2 C
Hyderabad
Saturday, February 14, 2026
spot_img

మంగళగిరిలో ఎయిమ్స్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని

     గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలోని అఖిల భార‌త వైద్య విజ్ఞాన సంస్థాన్ ను ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ జాతికి రాజ్‌కోట్ నుండి వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్‌ జోషి, డాక్టర్‌ భారతీప్రవీణ్‌ పవార్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ పాల్గొన్నారు.మంగ‌ళ‌గిరి ఎయిమ్స్ ను రూ.1618.23 కోట్లతో 183.11 ఎకరాల్లో 960 పడకలతో నిర్మించారు. ఇందు లో 125 సీట్లతో కూడిన వైద్య కళాశాల ఉంది. రాజ్‌కోట్‌ నుంచి వర్చువల్‌గా జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ.

     ప్రధాన మంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మిషన్‌లో భాగంగా రూ.230 కోట్ల విలువైన 9 క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌లకు కూడా ప్రధాని వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిలో కడప, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, రాజమహేంద్ర వరం, కర్నూలు, విజయనగరం జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల్లో రూ.23.75 కోట్ల చొప్పున, తెనాలి జిల్లా ఆస్పత్రిలో రూ.44.50 కోట్లు, హిందూపూర్‌ జిల్లా ఆస్పత్రిలో రూ.22.25 కోట్లతో చేపట్టనున్న క్రిటికల్‌ కేర్‌ బ్లాకుల్ని నిర్మించనున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్