స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణ అవతరణ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము , ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అద్భుతమైన ఈ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు అని ప్రధాని తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల నైపుణ్యాలు, సంస్కృతీ వైభవం ఎంతో గుర్తింపు పొందాయని.. తెలంగాణ శ్రేయస్సు, సౌభాగ్యం కోసం తాను ప్రార్థిస్తున్నట్లు మోడీ తెలిపారు. రాష్ట్రపతి ముర్ము తన ట్విట్టర్‌లో తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ.. రాష్ట్రంలో అడువులు, వన్యప్రాణులు సుసంపన్నంగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో నైపుణ్యవంతమైన ప్రజలు ఉన్నారని, రాష్ట్ర సాంస్కృతిక వారసత్వం కూడా సంపన్నమైందని పేర్కొన్నారు.
తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని
0
302
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


