‘Wolf’ Teaser : ప్రభుదేవాతో అనసూయ రొమాన్స్.. ఇది వేరే లెవెల్!

ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా, రాయ్ లక్ష్మీ, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో సందేశ్ నాగరాజు, సందేశ్ ఎన్ నిర్మాతలుగా, బృందా జయరామ్ సహ నిర్మాతగా ‘వూల్ఫ్’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి వినూ వెంకటేష్ దర్శకత్వం వహించారు. ప్రభుదేవా కెరీర్‌లో 60వ సినిమా వూల్ఫ్ రాబోతోంది. తమిళ, తెలుగు, కన్నడ , హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ మూవీ టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు.

వూల్ఫ్ టీజర్‌ను గమనిస్తుంటే కొత్త ప్రపంచానికి తీసుకెళ్లినట్టుగా అనిపిస్తోంది. అనసూయ, ప్రభుదేవా సరికొత్త లుక్కులో కనిపించారు. 69 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. ఇక ప్రభుదేవా యాక్షన్ సీక్వెన్స్‌లు, అనసూయ గెటప్ ఈ సినిమా మీద మరింతగా ఆసక్తిని పెంచేస్తున్నాయి.

వశిష్ట ఎన్ సింహా, అంజు కురియన్, రమేష్ తిలక్, లొల్లు సభా స్వామినాథన్, దీప, శ్రీ గోపిక, అవినాష్, సుజాతలు నటించిన ఈ మూవీకి అరుల్ విన్సెంట్ కెమెరామెన్‌గా, అమ్రిష్ సంగీత దర్శకుడిగా, లారెన్స్ కిషోర్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

నటీనటులు : ప్రభుదేవా, రాయ్ లక్ష్మీ, అనసూయ భరద్వాజ్, వశిష్ట ఎన్ సింహా, అంజు కురియన్, రమేష్ తిలక్, లొల్లు సభా స్వామినాథన్, దీప, శ్రీ గోపిక, అవినాష్, సుజాత తదితరులు

సాంకేతిక బృందం: 

నిర్మాత : సందేశ్ నాగరాజు, సందేశ్ ఎన్
సహ నిర్మాత : బృందా జయరామ్
దర్శకుడు : వినూ వెంకటేష్
సంగీత దర్శకుడు : అమ్రిష్
ఎడిటర్ : లారెన్స్ కిషోర్
కెమెరామెన్ : అరుల్ విన్సెంట్
పీఆర్వో : సాయి సతీష్

Latest Articles

విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్