‘పోలీస్ వారి హెచ్చరిక’ లోగో లాంచ్ చేసిన డైరెక్టర్ తేజ

అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో తూలికా తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్‌పై బెల్లి జనార్థన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా ‘పోలీస్ వారి హెచ్చరిక’. తాజాగా ఈ సినిమా టైటిల్ లోగోను డైరెక్టర్ తేజ ఆవిష్కరించారు. సన్నీ అఖిల్, అజయ్ ఘోష్, రవి కాలే, గిడ్డేశ్, శుభలేఖ సుధాకర్, షియాజీ షిండే, హిమజ, జయవాహినీ, శంకరాభరణం తులసి, ఖుషి మేఘన, రుచిత.. పలువురు ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

పోలీస్ వారి హెచ్చరిక లోగో లాంచింగ్ అనంతరం దర్శకుడు తేజ మాట్లాడుతూ.. ‘‘ఏ సినిమాకు అయినా ప్రేక్షకులను ఆకర్షించేది, వారిని థియేటర్ల వద్దకు రప్పించేది టైటిల్ మాత్రమే. ఈ పోలీస్ వారి హెచ్చరిక అనే టైటిల్ కూడా అలాంటి శక్తివంతమైన మాస్ టైటిల్. ఈ టైటిల్ దర్శక నిర్మాతలకు మంచి విజయం తీసుకురావాలి’’ అని అన్నారు.

నిర్మాత బెల్లి జనార్దన్ మాట్లాడుతూ.. సక్సెస్ ఫుల్ దర్శకుడు తేజ చేతుల మీదుగా తమ సినిమా పబ్లిసిటీ ప్రారంభించడం తమకు సంతోషాన్ని కలిగిస్తోందని తెలిపారు. ఇక దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ.. ఈ సినిమా షూటింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని అద్భుతమైన లొకేషన్‌లలో పూర్తి చేశామని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని తెలిపారు.

Latest Articles

ప్రభాస్.. షాకింగ్ అనౌన్స్ మెంట్..

బాహుబలి మూవీ ఓ చరిత్ర. ఒక కథను రెండు భాగాలుగా చెప్పచ్చు.. అలా చెప్పడం ద్వారా బ్లాక్ బస్టర్ సాధించవచ్చు.. అని నిరూపించింది దీంతో సీక్వెల్స్ ట్రెండ్ ఊపందుకుంది. స్టార్ హీరోలే కాదు.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్