29.2 C
Hyderabad
Friday, May 15, 2026
spot_img

పేలుడు ఘటనపై అనుమానితుడి ఫోటో విడుదల చేసిన పోలీసులు

       బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు పేలుడుపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీ సులు. కేఫ్‌లో ఉంచిన పేలుడు పదార్థాలతో కూడిన బ్యాగ్‌లో పేలుడు జరిగింది. బెంగళూరు పేలుడు జరిగిన ఒక రోజు తర్వాత అనుమానితుడు బ్యాగ్‌ని మోస్తున్న మొదటి చిత్రం బయటపడింది. ఓ వ్యక్తి చేతిలో క్యాప్, మాస్క్, ఐఈడీతో కూడిన బ్యాగ్‌తో కేఫ్‌లోకి ప్రవేశించడం.. ఆపై దానిని అక్కడే వదిలే యడం సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది.

    బెంగుళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న రామేశ్వరం కేఫ్ నగరంలోని అత్యంత ప్రసిద్ధ కేఫ్‌లలో ఒకటి. నిందితుడు పేలుడుకు ముందు బ్యాగ్‌ను కేఫ్‌లో ఉంచి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. అనుమానితుడితో కనిపించిన వ్యక్తిని కూడా బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తు న్నారు. ఈ వ్యక్తి బెంగళూరు నివాసి. ప్రస్తుతం సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ప్రత్యేక బృందం అతడిని విచారిం చే పనిలో నిమగ్నమై ఉంది.పేలుడుకు పాల్పడిన ప్రధాన నిందితుడు ముఖానికి మాస్క్‌తో కప్పుకున్నట్లు సీసీటీవీ వీడియోలో కనిపిస్తోంది. స్పెడ్స్, టోపీ పెట్టుకుని ఉన్నాడు. అతను కేఫ్ లోపల ఇడ్లీని తీసుకువె ళుతున్నట్లు కూడా కనిపిస్తోంది. రామేశ్వరం కేఫ్‌లో నిన్న మధ్యాహ్నం 12.50 నుంచి ఒంటి గంట మధ్య పేలుడు సంభవించింది. పేలుడు కారణంగా కేఫ్‌లో ఉన్న 10 మంది గాయపడ్డారు. ప్రస్తుతం ఫోరెన్సిక్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నాయి. బెంగళూరులోని హోటల్ రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు పేలుడు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన తర్వాత హైదరాబాద్‌లో నగర పోలీసులు హైఅలర్ట్‌ ఏర్పాటు చేశారు. పలు చోట్ల పోలీసులు తనిఖీలు చేపట్టారు. జూబ్లీ బస్టాండ్, ఎంజీబీఎస్ తదితర పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తు న్నారు. రద్దీగా ఉండే ప్రాంతాలతో పాటు మాల్స్‌లో కూడా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Latest Articles

పెట్రోల్, డీజిల్ ధరల పెంపు: రూ.3 పెంచిన ఆయిల్ కంపెనీలు

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్‌పై సగటున రూ.3, డీజిల్‌పై రూ.3 పెంచుతూ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్