Kidnap case: మహారాష్ట్రలో కిడ్నాప్‌.. ఆంధ్రాలో ప్రత్యక్షం.. ఇందులో మరో ట్విస్ట్..

Kidnap case: ఓ బాలుడి కిడ్నాప్‌ కేసును 13 నెలల తర్వాత పోలీసులు చేధించారు. మహారాష్ట్రలోని బొంబాయి నగరంలో కిడ్నాప్ గురైన బాలుడి ఆచూడీ దాదాపు ఏడాది తర్వాత ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో లభించింది. ముంబై నగరానికి చెందిన నాలుగున్నర సంవత్సరాల బాలుడు గత ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన తప్పిపోయినట్లు బాలుని తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన పోలీసులు. 13 నెలల తర్వాత కేసును చేధించారు. విజయవాడ రామలింగేశ్వర నగర్ కు చెందిన పగడాల శ్రావణి రంజిత్ దగ్గర బాలుడు ఉన్నట్లు కనుగొన్న మహారాష్ట్ర పోలీసులు.. విజయవాడ నగరానికి చేరుకున్న మహారాష్ట్ర పోలీసులు శ్రావణి రంజిత్ ను విచారించి వివరాలు రాబట్టారు. జగ్గయ్యపేట పట్టణంలోని చెరువు బజారుకు చెందిన శిల్పా అనే మధ్య వర్తి ద్వారా వత్సవాయి మండలం దేచుపాలెం లోని షేక్ నాగుల్ మీరా, షహనా బేగం దంపతులకు రెండు లక్షల రూపాయలకు అమ్మినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో జగ్గయ్యపేట చేరుకున్న పోలీసులు మొదట శిల్పను అదుపులో తీసుకొని విచారణ చేపట్టగా బాలుడు పట్టణంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో ఉన్నట్లు కనుగొని అక్కడ నుండి బాలుడను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు శ్రావణి రంజిత్ ను, బాలుడును ముంబై తీసుకెళ్లారు పోలీసులు.

Kidnap case:  కిడ్నాప్‌ అయిన తర్వాత బాలుడిని విజయవాడ తీసుకొచ్చి.. అక్కడ మధ్యవర్తుల ద్వారా విక్రయించినట్లు తెలుస్తోంది. కేవలం ఈ ఒక బాలుడేనా.. ఇంకా ఎవరినైనా ఇలా విక్రయించారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్