పవన్ కల్యాణ్ సీఎం కావాలంటూ.. మోకాళ్లపై 501 మెట్లు ఎక్కిన మహిళ

స్వతంత్ర వెబ్ డెస్క్: జనసేనాని పవన్ కల్యాణ్(Pavan Kalyan) ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ(Socia Media), వెలుపలా పవన్ పై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలంటూ ఓ మహిళ మోకాళ్లపై ఆదోని కొండ ఎక్కింది. కర్నూలు జిల్లా ఆదోనిలో రణమండల ఆంజనేయస్వామి ఆలయం చాలా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడి హనుమంతుడ్ని ఏదైనా కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.

 

ఈ ఆలయం ఓ కొండపై కొలువై ఉంది. కాగా, సదరు మహిళ పవన్ కు వీరాభిమాని, జనసేనకు గట్టి మద్దతుదారు. ఆమె రణమండల హనుమాన్ ఆలయం వద్దకు చేరుకునేందుకు మోకాళ్లపై 501 మెట్లు ఎక్కింది. పవన్ కల్యాణ్ సీఎం కావాలన్నదే ఆమె ఆకాంక్ష. ఆ మేరకు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. ఎంతో కష్టమైనప్పటికీ ఆమె మోకాళ్లపై కొండ ఎక్కిన తీరు పవన్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

Latest Articles

ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్‌

కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్