పవన్ కళ్యాణ్ ఒక దరిద్రుడు.. ప్యాకేజీ కోసం ఊడిగం చేస్తున్నాడు-మంత్రి రోజా

స్వతంత్ర వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్ మెంట్ పేరిట స్కామ్ కు పాల్పడి ఏపీ సీఐడీ చేత అరెస్టు కాబడిన చంద్రబాబు నాయుడు ఏసీబీ కోర్టు విధించిన 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ లో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఈ అరెస్టు వ్యవహారంలో బాబుకు ప్రజల నుంచి మద్దతు లభించకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు టీడీపీ శ్రేణులు. ప్రజల నుంచి మద్దతు లభించడం లేదనే అక్కసుతో జనాలను సమీకరించి అల్లర్లు సృష్టించాలని పార్టీ శ్రేణులకు అచ్చెన్నాయుడు టెలీకాన్ఫరెన్స్ ద్వారా సూచించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే జనసేనా అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు మద్దతివ్వడంపై మంత్రి రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్యాకేజీ కోసమే ఊడిగం చేస్తున్నాడంటూ ఎద్దేవ చేశారు.

విద్యార్థులకు నైపుణ్యాల పేరిట అవినీతికి పాల్పడిన చంద్రబాబుకు ప్రజలు మద్దతివ్వడం లేదని మంత్రి రోజా తెలిపారు. కానీ అవినీతి కేసులో అరెస్టైన వ్యక్తి కోసం నేను సపోర్ట్ చేస్తానిని ఓ దరిద్రుడు అంటున్నాడని మంత్రి రోజా వెల్లడించింది. అతడు మరెవరో కాదని ప్యాకేజీ స్టార్, చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అని సెటైర్లు వేశారు మంత్రి రోజా. జనసేన పార్టీ పెట్టి దానిని చంద్రసేనగా మార్చి బాబుకు ఊడిగం చేస్తున్నాడని దుయ్యబట్టింది. పవన్ వ్యవహరిస్తున్న తీరుకు ప్రజలు నవ్వుకుంటున్నారని మంత్రి రోజా తెలిపింది. పొత్తు కోసం బీజేపీ కావాలంటాడు.. ప్యాకేజీ కోసం టీడీపీ కావాలంటాడని.. అలాంటి వ్యక్తిని ప్రజలు ఎలా నమ్ముతారు? ఏవిధంగా మద్దతిస్తారని మంత్రి రోజా మీడియా వేదికగా విమర్శలు గుప్పించింది.

Latest Articles

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్