కేసీఆర్‌పై ‘ధర’ల బాణం ఎక్కుపెట్టిన చిదంబరం

తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అన్నారు. గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో చిదంబరం మాట్లాడారు. దేశంలోనే గ్యాస్‌ సిలిండర్‌ ధర హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉందని చెప్పారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఇంత వరకు భర్తీ చేయలేదని చిదంబరం వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నిరుద్యోగ భృతి హామీని నెరవేర్చలేదని విమర్శించారు. తెలంగాణలో ప్రతి పౌరుడిపై అప్పు లక్ష రూపాయలకు చేరిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు చిదంబరం.

‘‘తెలంగాణతో నాకు 2008 నుంచి అనుబంధం ఉంది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటన నాకు బాగా గుర్తుంది. రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైంది. రాష్ట్రంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం బాగా పెరిగింది. దేశంలో‌నే అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం తెలంగాణే. జాతీయ సగటు కన్నా ఎక్కువ. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. పాల ధరలూ విపరీతంగా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలూ రాష్ట్రంలోనే ఎక్కువ ఉన్నాయి. వ్యాట్ ఎక్కువ వసూలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణే. గ్యాస్ ధరలూ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయి.

తెలంగాణ నిరుద్యోగ రేటు 7.8 (పురుషులు), 9.5 (మహిళలు)గా ఉంది. గ్రామీణ నిరుద్యోగ రేటు జాతీయ సగటు కన్నా అధికం. రాష్ట్రంలో 15.1 శాతంగా ఉంది. 1.91 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 20 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయలేదు. టీఎస్‌పీఎస్సీలో 22 లక్షల‌ మంది నిరుద్యోగులు రిజిస్టర్ అయ్యారు. వారికి నిరుద్యోగ భృతి చెల్లించడంలో సర్కార్ ఫెయిల్ అయింది. ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రాష్ట్ర అప్పులు‌ 3.66 లక్షల కోట్లకు పెరిగింది. ఏటేటా అప్పులు భారీగా పెరిగాయి. ఫలితంగా ఒక్కొక్కరిపై 96 వేల రూపాయల అప్పు భారం పడింది. దీంతో సంక్షేమ పథకాల అమలు కష్టంగా మారింది. విద్య, వైద్యానికి కేటాయింపులు దారుణంగా పడిపోయాయి. పోషకాహార లోపం‌ తీవ్రంగా ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో‌ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలి. పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు.. ఆర్థిక వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశాభివృద్ధికి కారణమయ్యాయి. కాంగ్రెస్‌కి అవకాశం ఇస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500లకే గ్యాస్ సిలిండర్‌, ఇందిరమ్మ రాజ్యంలో రూ.4వేలు పెన్షన్‌ ఇస్తాం’’ అని చిదంబరం చెప్పారు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్