ఎస్.ఎల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై శ్రీకాంత్ ఆరోల్ల దర్శకత్వంలో భాస్కర్ యాదవ్ (బన్నీ) – లక్ష్మీ హీరోహీరోయిన్లుగా చంగల కుమార్ యాదవ్ నిర్మాతగా నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సినిమా “ఒక్కసారి ప్రేమించాక”. ఈ చిత్ర టికెట్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్, ఎన్.బి.టి.నగర్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని… మన హైదరాబాద్ కుర్రాడు, ముఖ్యంగా మన ఎన్.బి.టి.నగర్ కుర్రాడు బన్నీ యాదవ్ హీరోగా పరిచయం అవుతున్న “ఒక్కసారి ప్రేమించాక” చిత్రాన్ని మన హైదరాబాద్ వాసులు, మరీ ముఖ్యంగా ఎన్.బి.టి.నగర్ వాసులు ప్రతి ఒక్కరూ ఒక్కసారయినా చూసి, బన్నీని ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ చిత్రం ఎమ్.జి.ఎమ్ (మినిమం గ్యారంటీ) మూవీస్ ద్వారా నవంబర్ 3న ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదలవుతోంది!!
ఒక్కసారయినా చూసి తీరాల్సిందే: మేయర్ విజయలక్ష్మి
0
384
Previous article
Next article
Latest Articles
లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్ జెయిట్స్ జట్టు కెప్టెన్ నుంచి రిషబ్ పంత్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా...
- Advertisement -
- Advertisement -


