‘భోళా శంకర్’ నుంచి సరికొత్త అప్ డేట్

స్వతంత్ర వెబ్ డెస్క్: తన సినిమా గురించి సరికొత్త అప్డేట్ ఇచ్చాడు మన మెగాస్టార్ చిరంజీవి. మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి కధానాయకుడిగా నటిస్తున్న ‘భోళా శంకర్’ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించి డబ్బింగ్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఈ సినిమా రూపుదిద్దుకున్న విధానం చాలా సంతృప్తి కలిగించిందని వెల్లడించారు. ఈ సినిమా మాస్ విశ్వరూపం ప్రదర్శించడం ఖాయమని, ఆడియన్స్ ను కచ్చితంగా అలరిస్తుందని చిరంజీవి విశ్వాసం వ్యక్తం చేశారు. ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోందని, విడుదల తేదీని రౌండప్ చేసుకోవాలని సూచించారు. థియేటర్లలో కలుసుకుందాం అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ‘భోళా శంకర్’ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఈ మాస్ మెగా ఎంటర్టయినర్ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. చిరంజీవి చెల్లెలి పాత్రను కీర్తి సురేశ్ పోషిస్తుండడం విశేషం. సుశాంత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిశోర్, తులసి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మి గౌతమ్, ఉత్తేజ్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

Latest Articles

లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్‌ జెయిట్స్ జట్టు కెప్టెన్‌ నుంచి రిషబ్‌ పంత్‌ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్‌ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్‌ మీడియా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్