వైసీపీకి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్‌కు పంపించారు. గజనీలాంటి మనస్తత్వం కలిగిన జగన్‌తో కలిసి తాను పని చేయలేనని లేఖలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు పార్టీలోనే ఉంటూ వైసీపీని విమర్శిస్తున్న రెబల్ ఎంపీ రఘురామకృష్ణ ఎట్టకేలకు రాజీనామా చేశారు. వైసీపీ సభ్యత్వానికి మాత్రమే రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఎంపీగా కొనసాగు తానన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున నరసాపురం ఎంపీగా పోటీ చేసి గెలిచిన రఘు రామకృష్ణ… కొద్ది కాలానికే పార్టీతో విభేదించారు. తాజాగా అధికార పార్టీకి రాజీనామా చేశారు.