28.7 C
Hyderabad
Thursday, February 26, 2026
spot_img

Nara Lokesh : రాష్ట్ర వ్యాప్తంగా మోత మోగిద్దాం

స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో, ఇటీవల టీడీపీ హైకమాండ్ వినూత్న నిరసనలకు పిలుపుచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా మోత మోగిద్దాం, కాంతితో క్రాంతి కార్యక్రమాలు చేపట్టాయి. ప్లేట్లు కొట్టడం, విజిల్స్ ఊదడం, హారన్లు మోగించడం… ఇళ్లలో లైట్లు ఆపేసి బయటికొచ్చి దీపాలు, కొవ్వొత్తులు వెలించడం వంటి చర్యల ద్వారా చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. ఈ కోవలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘న్యాయానికి సంకెళ్లు’ పేరిట మరో నిరసన కార్యాచరణకు పిలుపునిచ్చారు.

“చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయించి న్యాయానికి సంకెళ్లు వేసిన పిచ్చి జగన్ నియంతృత్వ పోకడలు దేశమంతా తెలిసేలా ఆదివారం (అక్టోబరు 15) రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల వరకు చేతులను తాడు లేదా రిబ్బను, గుడ్డతోనైనా కట్టుకుని నిరసన తెలియజేయండి… తద్వారా చేతులకు సంకెళ్లు వేసుకున్నట్టుగా. న్యాయానికి ఇంకెన్నాళ్లీ సంకెళ్లని నినదించండి. ఆ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి చంద్రబాబు ధర్మపోరాటానికి మద్దతు ఇవ్వండి” అని లోకేశ్ సూచించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్