వేములవాడలో అభివృద్ధి పనులకు కేటీఆర్ శ్రీకారం..!

స్వతంత్ర వెబ్ డెస్క్: మంత్రి కేటీఆర్‌ వేములవాడ (Vemulawada) నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా వేములవాడ పట్టణంలోని నంది కమాన్‌ జంక్షన్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం చింతలతండా గ్రామపంచాయతీలో 42 డబల్ బెడ్‌రూమ్ ఇండ్ల పత్రాలను లబ్ధిదారులకు అందజేస్తారు.

జిల్లా దవాఖానలో డయాలసిస్ సెంటర్, డీఈఐసీ (DEIC) సెంటర్, మాతృసేవా కేంద్రాలను, హాస్పిటల్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన బయోగ్యాస్ ప్లాంటును ప్రారంభిస్తారు. మహాలక్ష్మి అమ్మవారి ఆలయం సమీపంలో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని, మధ్యాహ్నం 12 గంటలకు మూల వాగు వద్ద అత్యాధునిక హంగులతో ఏర్పాటుచేసిన వాకింగ్ ట్రాక్‌ను, శ్యామకుంట జంక్షన్ వద్ద కూరగాయల మార్కెట్‌ను ప్రారంభిస్తారు.

మధ్యాహ్నం 12.45 గంటలకు గుడి చెరువు అభివృద్ధి పనులకు, 1 గంటలకు బద్ది పోచమ్మ ఆలయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు భక్తుల సౌకర్యార్థం 100 గదుల కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ బంధు పథకంలో భాగంగా 600 మందికి చెక్కులను పంపిణీ చేస్తారు.

Latest Articles

గ్రేటర్ ఎన్నికల్లో సింగిల్‌గానే బీజేపీ బరిలోకి దిగుతోందా?

హైదరాబాద్ రాజకీయాల్లో మళ్లీ గ్రేటర్ డ్రామా షురూ అయింది. ఎన్నికల నగారా ఇంకా మోగకముందే భాగ్యనగర వీధుల్లో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుకుంది. రాజకీయ పార్టీలన్నీ కులాల మ్యాపులు, క్యాలిక్యులేటర్లు బయటకు తీసి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్