ఢిల్లీ పర్యటనలో మంత్రి కేటీఆర్..

స్వతంత్ర వెబ్ డెస్క్: రెండు రోజుల పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ అంశాలపై కేంద్ర సర్కారుపై ఒత్తిడి తేనున్నారు. పార్టీ ఎంపీలతో కలిసి వివిధ ప్రాజెక్టులు, పథకాలు, అభివృద్ధి అంశాల్లో అందించాల్సిన సహాయంపై పలువురు కేంద్ర మంత్రులను కలువనున్నారు. ఇందులో భాగంగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ నిర్వహణకు చేపట్టిన ఎస్సార్డీపీలో భాగంగా తలపెట్టిన స్కైవేల నిర్మాణం కోసం సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ భూములు ఇవ్వాల్సిందిగా మంత్రిని కోరనున్నారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ భూముల విషయమై గత కొన్నేండ్లుగా కేంద్రం ఏటూ తేల్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌పురీతో సమావేశం కానున్నారు. హైదరాబాద్‌లో ఉన్న మెట్రో పరిధిని మరింత విస్తరించాలని ఇప్పటికే అనేక సార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా స్పందించలేదు. హర్దీప్‌సింగ్‌పురీతో సమావేశం సందర్భంగా ఈ విషయంపై తేల్చాలని కోరే అవకాశం ఉన్నది. వీటితోపాటు రాష్ట్రానికి సంబంధించిన ఇతర పెండింగ్‌ అంశాలపై ఆయా శాఖల కేంద్రమంత్రులను మంత్రి కేటీఆర్‌ కలువనున్నట్టు సమాచారం. ఒకవేళ పెండింగ్‌ అంశాలపై కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన లేదా హామీ రాకపోతే మోదీ సర్కారు వైఖరిని ఎండగట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. తిరిగి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సృష్టిస్తున్న ఆటంకాలను ప్రజలకు వివరించి, బీజేపీ నిజస్వరూపాన్ని బట్టబయలు చేయాలని ప్రణాళిక రూపొందించినట్టు తెలిసింది.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్