37.2 C
Hyderabad
Tuesday, May 12, 2026
spot_img

మాస్ రాజా.. నయా ప్లాన్ వర్కవుట్ అయ్యేనా..?

మాస్ మహారాజా రవితేజకు కథ నచ్చితే చాలు.. ఆ డైరెక్టర్ సక్సెస్ లో ఉన్నాడా..? ఫ్లాపుల్లో ఉన్నాడా..? అనేది చూడకుండా సినిమా చేసేస్తుంటారు. అయితే.. మాస్ రాజా.. ఇటీవల స్టోరీ సెలెక్షన్స్ లో కేర్ తీసుకోవడం లేదని.. అందుకే.. వరుసగా ఫ్లాపులు వచ్చాయనేది ఇండస్ట్రీ జనాల్లో బాగా వినిపిస్తున్న మాట. ఇదిలా ఉంటే.. తనతో సినిమా తీసే నిర్మాతలకు నష్టం రాకూడదనే ఉద్దేశ్యంతో.. రవితేజ ఓ నిర్ణయం తీసుకున్నారట. అలాగే కొత్తగా రెండు ప్రాజెక్టులు కూడా ఓకే చేసారని టాక్. ఇంతకీ.. రవితేజ తీసుకున్న నిర్ణయం ఏంటి..? కొత్తగా ఓకే చేసిన ఆ రెండు ప్రాజెక్టులు ఏంటి..?

రవితేజ.. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో సక్సెస్ సాధించినా.. ఆతర్వాత నటించిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సంక్రాంతికి వచ్చిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ఫరవాలేదు అనిపించింది కానీ.. ఆశించిన బ్లాక్ బస్టర్ అయితే రాలేదు. ఇప్పుడు ఇరుముడి అనే డిఫరెంట్ మూవీ చేస్తున్నాడు మాస్ రాజా. ఇంకా చెప్పాలంటే.. తన వయసుకు తగ్గ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఓ కూతురుకు తండ్రి పాత్రలో రవితేజ నటిస్తుండడం.. అలాగే అయప్ప స్వామి భక్తుడుగా కనిపిస్తుండడంతో ఇరుముడి మూవీ పై ఆసక్తి ఏర్పడింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో.. శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.

ఇక రవితేజ తీసుకున్న కొత్త నిర్ణయం ఏంటంటే.. తన సినిమాల వలన నిర్మాత నష్టపోకూడదనే ఉద్దేశ్యంతో.. రెమ్యూనరేషన్ బాగా తగ్గించేసాడని ఓ వార్త వినిపిస్తోంది. ఇంతకు ముందు 25 కోట్లు తీసుకునే.. మాస్ రాజా ఇప్పుడు 15 కోట్లే తీసుకుంటున్నాడని.. ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. మరో వైపు.. రెమ్యూనరేషన్ కాకుండా.. సినిమా రిలీజ్ తర్వాత ప్రాఫిట్స్ లో షేర్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి రవితేజలో మార్పు అయితే వచ్చిందని.. నిర్మాతలు తన సినిమాల వలన నష్టపోకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.

రవితేజ ఓకే చేసిన రెండు ప్రాజెక్టులు ఏంటంటే.. యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో రవితేజ మూవీ ఓకే అయ్యిందట. అసలు వివేక్ ఆత్రేయ.. బాలయ్యతో ఓ సినిమా చేయాలి అనుకున్నారు. కథ చెప్పడం.. అది నచ్చడం.. ప్రాజెక్ట్ ఓకే అవ్వడం జరిగిందట. అయితే.. బాలయ్య వేరే ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడంతో.. ఆ ప్రాజెక్ట్ లేట్ అవుతుండడంతో.. రవితేజతో సినిమాని ముందుగా పట్టాలెక్కించేలా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఇక రవితేజ ఓకే చేసిన రెండో ప్రాజెక్ట్ ఏంటంటే.. హసిత్ గోలి డైరెక్షన్ లో మూవీ చేయడానికి ఓకే చెప్పాడట. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మించనున్నారు. వివేక్ ఆత్రేయ హిసిత్ గోలీ.. ఈ రెండు సినిమాలను ఓకేసారి సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. రెమ్యూనరేషన్ తగ్గించడం వలన బడ్జెట్ తగ్గుతుంది. పైగా యంగ్ డైరెక్టర్స్ తో మూవీస్ చేస్తున్నాడు. అందుచేత ప్లాన్ వర్కవుట్ అయి మాస్ రాజా సక్సెస్ సాధించే ఛాన్స్ ఎక్కువుగా ఉంది. మరి.. ఏం జరగనుందో చూడాలి.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్