నేడు ఈస్ట్‌కోస్ట్‌, ఫలక్‌నుమా సహా పలు రైళ్ల రద్దు

స్వతంత్ర వెబ్ డెస్క్: విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం పెను విషాదం సృష్టించింది. ఈ ఘటన నేపథ్యంలో ఇప్పటికే పలు రైళ్లు రద్దయిన విషయం తెలిసిందే. తాజాగా మరికొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇవాళ .. ప్రధాన రైళ్లయిన హవ్‌డా-సికింద్రాబాద్‌ (12703) ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌, హవ్‌డా-బెంగళూరు (12245) దురంతో ఎక్స్‌ప్రెస్‌, షాలిమార్‌- హైదరాబాద్‌ (18045) ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు తిరుపతి-పూరీ (17480) ఎక్స్‌ప్రెస్‌, పలాస-విశాఖ (08531) ప్యాసింజర్‌, తిరుపతి-విశాఖ (08584) ప్రత్యేక రైలు, విశాఖ-గుణుపూర్‌ (17240) ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు ప్రకటించారు. భువనేశ్వర్‌-కేఎస్‌ఆర్‌ బెంగళూరు(18463) ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను నేడు రీ షెడ్యూల్‌ చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలు భువనేశ్వర్‌లో ఉదయం 5.40గంటలకు బదులు ఉదయం 10 గంటలకు బయలుదేరేలా మార్పు చేసినట్లు తెలిపారు. ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదం నేపథ్యంలో సోమవారం పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించినట్లు వివరించారు.

Latest Articles

ఈటల ఫ్లెక్సీ రచ్చపై స్పందించిన రామచందర్‌రావు.. కొందరు కుట్రలు చేశారు

ఈటెల రాజేందర్ మీద వచ్చిన అభియోగాలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రామ్ చందర్ రావు స్పందించారు. ఈటెల ఏడుపు బీజేపీకి శాపం అంటూ హైదరాబాద్ లో బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి. బ్యానర్లు, పోస్టర్లు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్