ములుగు పర్యటనలో కేటీఆర్.. రూ.150 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ మున్సిపల్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు. మంత్రి మహమూద్ అలీతో కలిసి హెలికాప్టర్‌లో ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చేరుకున్న కేటీఆర్‌కు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ స్వాగతం పలికారు. మంత్రులతో కలిసి దశాబ్ది వేడుకల్లో భాగంగా రూ.150 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. డిగ్రీ కళాశాల సమీపంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయానికి, పక్కనే రూ.38.50 కోట్లతో నిర్మించనున్న జిల్లా పోలీసు కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ కార్యాలయ భవనాలు, మోడల్ బస్టాండ్ కాంప్లెక్స్, సేవాలాల్ భవనాలకు కూడా శంకుస్థాపన చేశారు.

అనంతరం ములుగు జిల్లా కేంద్రం నుంచి రామప్ప ఆలయానికి చేరుకుని శిల్ప సంపదను వీక్షించి రుద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. రామప్ప చెరువు గట్టు వద్దకు చేరుకుని తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవంలో భాగంగా సాగునీటి ఉత్సవాలను ప్రారంభించి అక్కడ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రానికి చేరుకున్న అనంతరం ములుగు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో రూ.30 లక్షలతో నిర్మించనున్న డిజిటల్ లైబ్రరీకి, నిర్మించనున్న సమాచార పౌర సంబంధాల శాఖ సమావేశ మందిరానికి శంకుస్థాపన చేస్తారు. రూ.15 లక్షలతో, జిల్లా కేంద్రంలో రూ.2 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లు. అక్కడి నుంచి సాధన స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుంటారు.

Latest Articles

తెలంగాణ ప్రజలకు శుభవార్త..రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

తెలంగాణ ప్రజలకు శుభ వార్త. రాష్ట్రం లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని జోగులాంబ జిల్లాలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. రాష్ట్రంలో మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. మూడు రోజుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్