ఎంపీ ఎన్నికల తర్వాత కేటీఆర్ జైలుకు పోవడం ఖాయమని కాంగ్రెస్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. కవిత లిక్కర్ స్కామ్‌తో పాటు మరికొన్ని కుంభకోణాలు బయటపడుతున్నాయన్నారు. ఫోన్ ట్యాపింగ్‌లో భార్యాభర్తల మాటలు వినడం సిగ్గుచేటన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ ఎస్ పార్టీ కనుమరుగవుతుందని తెలిపారు. 10సంవత్సరాలు బీఆర్‌ఎస్ అధికారంలో ఉండి కూడా రైతు లను పట్టించుకోలేదని… ఇప్పుడు రైతుల కోసం ముసలి కన్నీళ్లు కారుస్తుందన్నారు. రైతులు పండించిన ప్రతి గింజ కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు.
ఎంపీ ఎన్నికల తర్వాత కేటీఆర్ జైలుకు పోవడం ఖాయం – షబ్బీర్ అలీ
0
254
Previous article
Next article
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


