38.2 C
Hyderabad
Monday, May 4, 2026
spot_img

తిరుమలలో రేపు కార్తీక వన భోజనం

తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వెంకన్న సన్నిధిలో ప్రతి ఏటా నిర్వహించే కార్తీక వన భోజన కార్యక్రమం రేపు శ్రీ‌వారి ఆల‌యం స‌మీపంలోని వైభ‌వోత్స‌వ‌ మండపంలో జరుగనుంది. సాదార‌ణంగా గోగర్భం సమీపంలో గల పార్వేటమండపంలో నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీ. వాతావ‌ర‌ణ శాఖ తుఫాన్ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో ఈ ఏడాది వైభ‌వోత్స‌వ‌ మండపంలో నిర్వ‌హించాల‌ని టీటీడీ నిర్ణ‌యించింది. పవిత్రమైన కార్తీకమాసంలో వనభోజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఇందులో భాగంగా ఉదయం శ్రీ‌వారు ఉభయనాంచారులతో క‌లిసి వైభ‌వోత్స‌వ మండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 నుండి 12 గంటల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహిసారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అనంత‌రం స్వామివారు ఆల‌యానికి వేంచేస్తారు. ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి అలయంలో నిర్వహించు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జితబ్రహ్మూెత్సవం, సహస్రదీపాలంకారసేవలను టీటీడీ రద్దు చేసింది.

Latest Articles

పోటీ చేసిన రెండు చోట్లా విజయ్‌ గెలుపు.. విజిల్ మోత మోగింది

సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్‌ సంచలనం సృష్టించాడు. తమిళ రాజకీయాల్లో అసాధ్యమనుకున్నది సుసాధ్యం చేసి చూపించారు. రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన కేవలం రెండేళ్ల రెండు నెలల వ్యవధిలోనే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్