‘కలివీరుడు’ ఈనెల 22న వచ్చేస్తున్నాడు!

“కలివీర” పేరుతో కన్నడలో రూపొందిన ఓ చిత్రం అనూహ్య విజయం సాధించి… రికార్డు స్థాయి వసూళ్లతో కన్నడ ఖ్యాతిని మరింత పెంచింది. ఈ చిత్రం తెలుగులోనూ సంచలన విజయం సాధించేందుకు “కలివీరుడు”గా మన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. “కలివీర” తెలుగులో “కలివీరుడు”గా వస్తోంది అన్న ప్రకటన వెలువడిన కొద్ది రోజుల్లోనే… ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లో బిజినెస్ అయిపోవడం విశేషం!!

ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎమ్.అచ్చిబాబు ఈ క్రేజీ చిత్రాన్ని అత్యంత ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుని… “మినిమం గ్యారంటీ మూవీస్” పతాకంపై తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈనెల 22న భారీ అంచనాలతో వస్తున్న “కలివీరుడు” చిత్రం ట్రైలర్ రిలీజ్ చేశారు. “అవి” దర్శకత్వంలో… రియల్ ఫైట్స్‌కు పెట్టింది పేరైన కన్నడ సెన్సేషన్ ఏకలవ్య టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో చిరాశ్రీ హీరోయిన్. డేని కుట్టప్ప, తబలా నాని, అనితాభట్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈమధ్య కాలంలో చిన్న సినిమాల్లో బిజినెస్ పరంగా కనీ వినీ ఎరుగని క్రేజ్ సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 22న విడుదల చేసేందుకు నిర్మాత అచ్చిబాబు సన్నాహాలు చేస్తున్నారు. “కాంతారా” కోవలో “కలివీరుడు” తెలుగులోనూ కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు!!

ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్ – అప్పాజీ, పోస్టర్స్: విక్రమ్ ఎ.హెచ్ – అనిల్ కొడాలి, ఛాయాగ్రహణం: హలేష్ ఎస్, ఎడిటర్: ఎ.ఆర్.కృష్ణ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రాఘవేంద్ర, నిర్మాత: ఎమ్.అచ్చిబాబు, రచన – దర్శకత్వం: అవి!!

Latest Articles

తీవ్రంగా కొనసాగుతున్న ఇరాన్‌, అమెరికా యుద్ధం

అమెరికా వర్సెస్ ఇరాన్ మధ్య యుద్ధం భయంకరంగా కొనసాగుతోంది. శాంతి ఒప్పందం జరిగినప్పటికీ.. రెండు దేశాలు రూల్స్ బ్రేక్ చేసి హింసకాండను కొనసాగిస్తున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్