స్వతంత్ర, వెబ్ సైట్: ఏపీలో ఈరోజు కరెంటు చార్జీలు మోత మోగిపోతుందన్నారు తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్. గుంటూరు జిల్లా తుళ్ళూరులో కరెంటు చార్జీల పెంపుపై వ్యతిరేకతను తెలియజేస్తూ తుళ్లూరు టీడీపీ కార్యాలయంలో శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో టిడిపి నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మూడుసార్లకు పైగా విద్యుత్ ఛార్జీలు పెంచారని అన్నారు. 2019వ సంవత్సరం చంద్రబాబు నాయకత్వంలో ఒక సామాన్య కుటుంబానికి 166/- కరెంట్ bill వస్తె.. అదే సామాన్య కుటుంబానికి ఈ రోజు వైసీపీ ప్రభుత్వంలో 607/- బిల్ వచ్చిందన్నారు. బిల్లును ఎన్నిరెట్లు పెంచారో గమనించండని అన్నారు. గతంలో 2014లో కరెంట్ కోతలతో విసుగెత్తిపోతున్న ప్రజలకు కేవలం 100 రోజుల్లో విముక్తి కలిగించిన ఘనత తెలుగుదేశం పార్టీది, అది చంద్రబాబుకే సాధ్యపడింది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అవినాష్ రెడ్డి దగ్గర నుండి నాసిరకంగా ట్రాన్స్ఫార్మర్లను వాడడం, ఆ చార్జీలు, ఈ చార్జీలు అంటూ సామాన్య ప్రజలపై భారం మోపుతూ అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని అన్నారు.