భారత ఆహార శుద్ధి పరిశ్రమ అద్భుతంగా పురోగమిస్తోంది- మోదీ

స్వతంత్ర వెబ్ డెస్క్:  భారత ఆహార శుద్ధి పరిశ్రమ అద్భుతంగా పురోగమిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. గత తొమ్మిదేళ్లలో ఆహార శుద్ధి పరిశ్రమ 50 వేల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించిందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే. ఈస్థాయిలో ఎఫ్​డీఐలు వచ్చాయని మోదీ తెలిపారు. దిల్లీలోని భారత మండపంలో జరిగిన వరల్డ్ ఫుడ్ ఇండియా 2023ను కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి పశుపతి కుమార్‌ పరాస్‌తో కలిసి మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు కొనసానుంది. వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా మొదటి ఎడిషన్ 2017లో జరిగగా అనంతరం కొవిడ్‌ కారణంగా కార్యక్రమం జరగలేదు. మూడురోజులపాటు జరిగే ఈ ఎడిషన్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలోని వివిధ అంశాలపై చర్చించేందుకు 48 సెషన్‌లు నిర్వహిస్తారు. ఆర్థిక సాధికారత, నాణ్యత హామీ, యంత్రాలు. సాంకేతికతలో ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రముఖ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల సీఈవోలతో సహా 80కిపైగా దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఫుడ్ స్ట్రీట్‌ను కూడా ప్రారంభించిన ప్రధాని మోదీ . అందులో కలియతిరిగి నిర్వాహకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తొమ్మిదేళ్ల ఎన్డీఏ పాలనలో శుద్ధిచేసిన ఆహార ఎగుమతులు 150 శాతం పెరిగాయని తెలిపారు. దేశీయ ప్రాసెసింగ్ సామర్థ్యం గణనీయంగా పెరిగిందని వెల్లడించారు.

Latest Articles

టెలిగ్రామ్‌ బ్యాన్‌పై రాహుల్‌గాంధీ ఆగ్రహం

టెలిగ్రామ్‌ బ్యాన్‌పై రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్‌ లీక్‌ మాఫియాను పట్టుకోలేక... విద్యార్థుల ప్లాట్‌ఫామ్‌కు తాళం వేస్తారా? అని మండిపడ్డారు. తాత్కాలిక బ్యాన్‌తో పేపర్‌ లీక్‌ మాఫియా ఆగదని..టెలిగ్రామ్‌ తర్వాత వాట్సాప్‌ను...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్