స్వతంత్ర వెబ్ డెస్క్: టిడిపి చీఫ్ చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని హీరోయిన్ పూనమ్ కౌర్ విజయవాడ ఇంద్ర కీలాద్రిపై పూజలు చేశారు. ఆమె తన కుటుంబసభ్యులతో కలిసి దుర్గమ్మను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఈ వయసులో చంద్రబాబు జైల్లో ఉండడం నన్ను కలచివేసింది. ఆయన త్వరగా జైలు నుంచి విడుదల కావాలని అమ్మవారిని వేడుకున్నాను’ అని పూనమ్ కౌర్ తెలిపారు. ఇది ఇలా ఉండగా.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డీజీపీకి టీడీపీ లేఖ రాసింది. నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి చేపట్టబోయే యాత్రకు భద్రత కల్పిచాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డీజీపీకి టీడీపీ లేఖ రాశారు. ఈ నెల 25వ తేదీ నుంచి చంద్రగిరి నియోజకవర్గం నారా వారిపల్లి నుంచి ప్రారంభం కానుంది నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపం చెంది మరణించిన కుటుంబాలను పరామర్శించనున్నారు భువనేశ్వరి. అవాంఛనీయ సంఘటనలు ఏవీ జరగకుండా ఉండేలా విధంగా భువనేశ్వరికి తగిన బందోబస్తు కల్పించాలని లేఖలో పేర్కొన్నారు వర్ల రామయ్య. మరి దీనిపై ఏపీ డీజీపీ ఎలా స్పందిస్తారో చూడాలి.
చంద్రబాబు జైలు నుంచి రిలీజ్ కావాలని హీరోయిన్ పూజలు
0
362
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


