పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. దీంతో ఇందుకు ప్రత్యామ్నాయమైన ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు వాహనదారులు మొగ్గుచూపుతున్నారు. అందుకే మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్లు, మోటర్‌సైకిల్స్ ఉత్పత్తులుపెరిగిపోతున్నాయి. అలాగే ఇందులో కూడా చాలా మంది అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చిన మోటర్‌సైకిల్స్, కార్లు కొనుగోలు చేస్తున్నారు. మీరు కూడా ఎప్పటి నుంచో మంచి మోటర్‌సైకిల్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం త్వరలోనే ప్రముఖ మోటర్‌సైకిల్ తయారీ కంపెనీ హీరో గుడ్‌న్యూస్ తెలపబోతోంది. త్వరలో విడుదల కాబోయే హీరో కొత్త ఎలక్ట్రిక్ బైక్ వివరాలు తెలుసుకోవాలని ఉందా..?
హీరో ఎలక్ట్రిక్ బైక్ స్పెండర్ డిజైన్‌లో విడుదల కానుంది. అంతేకాకుండా ఇది చూడడానికి చాలా అందంగా, మంచి కలర్‌లో ఆకట్టుకునేలా ఉంటుంది. హీరో స్పెండర్ ఎలక్ట్రిక్ బైక్ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అలాగే ఇది అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రీమియం కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రానుంది. అలాగే బాడీ ఫినిషింగ్‌లో భాగంగా దీనికి హీరో కంపెనీ ప్రత్యేకమైన గ్రాఫిక్స్ స్టిక్కర్స్‌ను అందిస్తోంది. అలాగే ఫ్రంట్ భాగంలో ప్రీమియం లైట్ సెటప్‌ను కూడా అందిస్తోంది. ప్రత్యేకమైన ఎంటిగేటర్ లైట్ సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. దీని వల్ల రాత్రి పూట కూడా రోడ్డు చాలా క్లియర్‌గా కనిపిస్తుంది.
హీరో ఎలక్ట్రిక్ బైక్ ఎంతో శక్తివంతమైన ఇంజన్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇది అద్భుతమైన మైలేజీతో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది గత మోడల్ ఇంజన్ కంటే నాయిస్ లెస్‌తో విడుదల కానుంది. అలాగే రైడర్ అద్భుతమైన అనుభూతిని పొందేందుకు ప్రత్యేకమైన సీటింగ్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు స్పెషల్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుందని సోషల్ మీడియాలో లీక్ అయిన ఫీచర్స్ ద్వారా తెలుస్తోంది.
హీరో ఎలక్ట్రిక్ బైక్ స్పెండర్ బ్యాటరీ విషయానికి వస్తే.. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 90 నుంచి 105 కిలో మీటర్ల వరకు వెళ్లవచ్చు. అంతేకాకుండా దీనిని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4 గంటల సమయం సరిపోతుంది. అలాగే ఈ బ్యాటరీ చార్జింగ్ చేసేందుకు ప్రత్యేకమైన సాకెట్‌ను కంపెనీ అందిస్తోంది. ఇక దీని ధర రూ.85 వేల నుంచి ప్రారంభమవుతుందట. అయితే హీరో కంపెనీ ఈ మోటర్‌సైకిల్‌ను వచ్చే ఏడాది 2026 మొదటి నెల లేదా రెండవ నెలలో విడుదల చేయనుందని సమాచారం.