అందం, అభినయం.. ఈ రెండింటితో ఆకట్టుకుని తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ ముద్దుగుమ్మ హనీ రోజ్. మలయాళంలో ఎన్నో విభిన్న కథా చిత్రాల్లో.. వైవిధ్యమైన పాత్రలు పోషించిన ఈ కేరళ కుట్టి తాజాగా పోలీసులను ఆశ్రయించింది. తనను వేధిస్తున్నారు అంటూ.. కంప్లైట్ చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఏకంగా 27 మంది పై కేసు నమోదు చేశారు. ఆమెను ఎందుకు వేధిస్తున్నారు..? అసలు ఏం జరిగింది..?
నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాలో పాత్రకు తగ్గట్టుగా నటించి మెప్పించింది హనీ రోజ్. ఈ ఒక్క సినిమాతోనే తెలుగులో బాగా పాపులర్ అయ్యింది. అయితే.. ఈ అమ్ముడు తనను వేధిస్తున్నారని ఆదివారం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. దీంతో సోమవారం ఉదయం కేరళలోని ఎర్నాకుళం నగర పోలీసులు రంగంలోకి దిగారు. ఏకకంగా 27 మందిని కనిపెట్టి వారి పై కేసు నమోదు చేశారు. అందులో కుంబళంకు చెందిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారని కూడా వార్తలు వస్తున్నాయి.
అసలు ఏం జరిగింది..? ఎందుకు హనీరోజ్ ను వేధిస్తున్నారంటే.. ఒక వ్యక్తి కావాలనే అవమానిస్తున్నాడు. అయినప్పటికీ.. నేను సైలెంట్ గానే ఉన్నాను. అయితే.. సైలెంట్ గా ఉంటుంటే.. నువ్వు అతని వ్యాఖ్యలను స్వాగతిస్తున్నావా…? అని చాలా మంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు. తనను వేధిస్తున్న ఆ వ్యక్తి కొన్ని కార్యక్రమాలకు ఆహ్వానించాడని.. అయితే కొన్ని కారణాల వలన ఆ కార్యక్రమాలకు వెళ్లలేకపోయానని.. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇదంతా చేస్తున్నాడని హనీ రోజ్ తెలియచేశారు. తను వెళ్లే ప్రతి ఈవెంట్ కు రావడం.. వీలు కుదిరినప్పుడల్లా కించపరిచేలా కామెంట్ చేస్తున్నాడు అని ఆమె తెలియచేశారు.
ఇక సైలెంట్ గా ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పారు. ఈ మేరకు తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. వివరణాత్మక విమర్శలు, నా లుక్స్ పై వేసే సరదా జోక్స్, మీమ్స్‌ను నేనూ స్వాగతిస్తాను. వాటిని పెద్దగా పట్టించుకోను కానీ.. దేనికైనా ఒక లిమిట్ అంటూ ఉంటుందని నమ్ముతున్నాను. అసభ్యకరంగా కామెంట్స్ చేస్తే.. సహించేది లేదు. అలాంటి కామెంట్స్ చేసే వారిపై న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వారిపై నా యుద్ధం ప్రకటిస్తున్నాను. నా కోసం మాత్రమే కాదు.. మహిళలందరి కోసం నేను ఈ పోరాటం చేస్తున్నాను అని హనీ రోజ్ పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది.