విద్యార్థులకు శుభవార్త.. 6న సీఎం అల్పాహారం పథకానికి శ్రీకారం

స్వతంత్ర వెబ్ డెస్క్:  ప్రభుత్వ స్కూళ్లలో దసరా నాటికి ప్రారంభించాల్సిన సీఎం అల్పాహార పథకాన్ని ఈనెల 6న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 13 నుంచి దసరా సెలవులు ఉండటంతో 6 నుంచి జిల్లాకు ఒక స్కూలులో పథకం అమలు చేసి పరిశీలించనుంది. అక్టోబర్ 26న స్కూల్లు పునః ప్రారంభం కానుండగా… లోపాలను సరిచేసి అన్ని పాఠశాలలకు విస్తరించాలని భావిస్తుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నుంచి ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎయిడెడ్ స్కూళ్లు 642, మోడల్ స్కూళ్లు 194, మదర్సాలు 100 ఉన్నాయి. వీటిల్లో 1.50 లక్షలకు పైగా విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనున్నది. విద్యార్థులకు ఇప్పటికే నాణ్యమైన విద్యను అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం… మానవీయ కోణంలో పోషకాహారాన్ని అందించేందుకు ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ఉదయాన్నే విద్యార్థుల ఆకలి బాధలను తీర్చాలన్న సంకల్పంతో అల్పాహార పథకాన్ని అమలు చేయనున్నది.  విద్యార్థుల చదువుల పట్ల ఏకాగ్రత పెంచడం, కూలి పనులు చేసుకునే తల్లిదండ్రులకు ఇబ్బంది కలగకూడదన్న ద్విముఖ వ్యూహంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నది.

Latest Articles

వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల

మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్