గత కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు ఇవాళ కాస్త ఊరటనిచ్చాయి. తులం బంగారం రేటు స్వల్పంగా దిగివచ్చింది. ఇక వెండి రేటు మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు తులానికి రూ.100 మేర తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.68 వేల 50 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.100 మేర తగ్గి ప్రస్తుతం రూ. 74 వేల 240 వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇక ఢిల్లీ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ.100 తగ్గి రూ. 68 వేల 50 వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారం రేటు రూ.100 తగ్గి తులం ధర రూ.74 వేల 240 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు వెండి ధరలు గత నాలుగు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇవాళ కిలో వెండి రేటు హైదరాబాద్‌లో ఎలాంటి మార్పు లేకుండా రూ.86 వేల 500 మార్క్ వద్ద ట్రేడింగ్ అవుతోంది.
స్వల్పంగా తగ్గిన బంగారం ధర
0
272
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


