బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ట్యాగ్‌ చేస్తూ గౌతమ్‌ గంభీర్‌ ట్వీట్‌

    బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. తనను రాజకీయ విధుల నుంచి తప్పించాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను అభ్య ర్థించారు. క్రికెట్‌కు సంబంధిం చిన బాధ్యతల నిమిత్తం.. తనన్ను రాజకీయ విధుల నుంచి తప్పించ మని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను అభ్యర్థిం చానన్నారు. ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. జై హింద్‌ అంటూ ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.

      గంభీర్ 2019లో బీజేపీలో చేరారు. తూర్పు ఢీల్లీ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన ఆయన.. స్థానికంగా కీలకంగా వ్యవహరించారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ దక్కకపో వచ్చనే వార్తల నేపథ్యం లో ఆయన ఈ పోస్ట్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు ప్రధాని మోదీ సారథ్యంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ రెండురోజుల క్రితం సమావేశం నిర్వహించింది. ఏ క్షణమైనా ఆ జాబితా విడుదలయ్యే అవకాశాలు కనిపి స్తున్నాయి. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌ షాతో సహా సుమారు వంద మందికి పైగా అభ్యర్థు లతో ఆ లిస్ట్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

Latest Articles

రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష

రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి CRDA కమిషనర్ విజయరామరాజు, అదనపు కమిషనర్లు, ఏడీసీఎల్ ఎండీ లక్ష్మీ పార్థసారథి, ఇంజినీర్లు హాజరయ్యారు. అమరావతిలో ప్రాజెక్టుల వారీగా పనుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్