‘ఐయాం విత్ సీబీఎన్’ పేరుతో.. విప్రో సర్కిల్ వద్ద ఐటీ ఉద్యోగుల ప్రదర్శన

స్వతంత్ర వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడం పట్ల దేశంలోనే కాకుండా, ఇతర దేశాల్లోని ఎన్నారైల నుంచి సైతం వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ ను మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, కుమారస్వామి తదితర నేతలు తప్పుపట్టారు. విపక్ష నేతలను అక్రమంగా అరెస్ట్ చేసే ట్రెండ్ కేంద్రం నుంచి రాష్ట్రాలకు కూడా పాకిందని అఖిలేశ్ విమర్శించారు. ఈ అరెస్ట్ చంద్రబాబుకే లబ్ధి చేకూర్చే అవకాశం ఉందని ఫరూక్ అబ్దుల్లా చెప్పారు.

మరోవైపు చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ ఏపీతో పాటు తెలంగాణలో కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ వైఖరిని తప్పుపడుతూ టీడీపీ మద్దతుదారులు ఆందోళన చేస్తున్నారు. ఇంకోవైపు ఈ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద ఐటీ ఉద్యోగులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. చంద్రబాబుకు సంఘీభావం ప్రకటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ‘ఐయాం విత్ సీబీఎన్’ పేరుతో మెయిల్స్, సోషల్ మీడియా ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఇన్విటేషన్ షేర్ అవుతోంది. ‘రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ కుట్రలో చంద్రబాబు బాధితుడు. ఈ సంక్షోభ సమయంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది’ అంటూ దీనికి సంబంధించిన పోస్టర్ లో పేర్కొన్నారు.

Latest Articles

టీడీపీలో దిద్దుబాటు చర్యలు?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భవిష్యత్ ప్రయాణంపై సరికొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. కేవలం సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకుని అంతా సవ్యంగానే ఉందనుకుంటే మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్