మాజీ మంత్రి హరీశ్‌రావుకు AIG ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. తీవ్ర భుజం నొప్పితో బాధపడుతున్న ఆయనకు చికిత్స చేస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో నిన్న సాయంత్రం హరీశ్‌రావును అదుపులోకి తీసుకునే క్రమంలో ఆయన భుజానికి గాయం అయింది. ఈ నేపథ్యంలో ఏఐజీలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
అంతకు ముందు బీఆర్‌ఎస్ ఆందోళనల నేపథ్యంలో హరీశ్ రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. భుజం నొప్పిగా ఉన్నదని, ఆస్పత్రికి వెళ్లాలని చెప్పినప్పటికీ అడ్డుకున్నారు. అయితే కొద్దిసేపటి తర్వాత ఏఐజీకి వెళ్లేందుకును పర్మిషన్ ఇచ్చారు. అయితే హరీశ్‌రావుతోపాటు పోలీసులు కూడా ఆస్పత్రికి వెళ్లారు.