లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట దొరికింది. ఈ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. అయితే, ఈడీ కేసులో ఇప్పటికే బెయిల్ వచ్చింది. లిక్కర్ కేసు గురించి మాట్లాడకూడదని కేజ్రీవాల్‌కు షరతు విధించిన సుప్రీంకోర్టు.