Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

తెలంగాణ రాష్ట్ర అవతరణ దీనోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం

    గన్‌ పార్క్‌ వద్ద అమరవీరులకు నివాళులు, పరేడ్ గ్రౌండ్స్‌లో రాష్ట గీతం ఆవిష్కరణ, సాయంత్రం ట్యాంక్ బండ్ పై పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేళ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిం చనున్న కార్యక్రమాల లిస్ట్ ఇది. అటు విపక్ష బీఆర్ఎస్ సైతం మూడు రోజుల పాటు దశాబ్ది ఉత్సవాల ముగింపు పేరు తో వేడుకల్ని నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇటు అధికార పార్టీ అటు విపక్ష పార్టీ ఎవరికి వారే. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

     రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఈ మాట వింటే చాలు తెలంగాణ యావత్తూ సంతోషంతో ఉప్పొంగి పోతుంది. జూన్ రెండు, 2014న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వేరుపడి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణకు భారతదేశ పటంలో చోటు దక్కింది. అంతే పార్టీలకు అతీతంగా, కుల, మతాలకు అతీతం గా ప్రజలంతా సంబరాలు జరుపుకున్నారు. ఈసారి వేడుకలకు ఓ ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీయే రాష్ట్రంలో అధికారంలో ఉంది. దీంతో ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించాలని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు తగినట్లే ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇందుకు సంబంధించి యంత్రాంగానికి సూచనలు, సలహాలు ఇవ్వడమే కాకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్న తీరుపై అడిగి తెలుసుకుంటున్నారు. జూన్ రెండున ఏర్పాటు చేసిన కార్యక్రమాలు, షెడ్యూలు విషయానికి వస్తే, ఉదయం గన్‌పార్క్‌ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పిస్తారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారిని గుర్తుకు తెచ్చుకొని వారి త్యాగాలను స్మరించుకుంటారు. అనంతరం సికింద్రాబాద్‌లో ఉన్న పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన తర్వాత రాష్ట్ర గీతాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు సీఎం రేవంత్ రెడ్డి.

 ఈ క్రమంలోనే ఆయా ప్రదేశాల్లో ఏర్పాట్లకు సంబంధించి వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతా ధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎస్. ఇక, జూన్ రెండు సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్యాంక్ బండ్‌పై కళారూపాలతో ప్రదర్శన ఉంటుంది. ఇందుకోసం రాష్ట్రంలోని భిన్న విషయాలు, సంస్కృతులు ప్రతిబింబిం చేలా కళారూపాలు తరలిరానున్నాయి. ఇక, శిక్షణ పొందుతున్న 5000 మంది పోలీసు అధికారులు బ్యాండ్‌తో వేడుకల్లో పాల్గొంటారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా దాదాపు 80 స్టాళ్లను ఏర్పాటు చేసి హస్తకళలు, చేనేత, స్వయం సహాయక బృందాలు తయారు చేసిన వస్తువులను ప్రదర్శనలో ఏర్పాటు చేస్తారు. ఇక, నగరంలోని పలు హోటళ్లు సైతం స్టాళ్లను ఏర్పాటు చేయనున్నాయి. ఇక, కార్యక్రమానికి వచ్చే వారి కోసం పలు రకాల క్రీడలతో కూడిన వినోదశాలను ఏర్పాటు చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం బాణసంచా ప్రదర్శన, లేజర్ షో ఏర్పాటు చేసింది తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక, రాష్ట్ర మంతా పండుగ రోజు కావడంతో ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ దీపాల వెలుగులతో దగదగా మెరిసిపోనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ శరవేగంగా సాగుతున్నాయి. ఇటు ప్రభుత్వమే కాదు. అటు తెలంగాణను కొట్లాడి తీసుకొచ్చామని ఎప్పుడూ చెప్పే బీఆర్ఎస్ సైతం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను వైభవంగా నిర్వ హించాలని నిర్ణయించింది. గులాబీ పార్టీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఈ వేడుకలను నిర్వహిం చాలని పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. జూన్ ఒకటిన ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు జూన్ మూడున ముగియనున్నాయి.

   జూన్ ఒకటిన గన్‌పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అమర జ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం ఏడు గంటల నుంచి గులాబీ నేతలు పెద్ద -సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొంటారు. రాష్ట్ర సాధనలో ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించను న్నారు. ఇక, జూన్ రెండున దశాబ్ది వేడుకల ముగింపు సభ నగరంలోని పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్‌ లో మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మహానగరం హైదరాబాద్‌ లోని పలు ఆస్పత్రుల్లో, అనాథ శరణాలయాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పండ్లు, స్వీట్ల పంపిణీ కార్యక్ర మాలు నిర్వహి స్తారు. ఇక, జూన్ మూడున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పార్టీ జెండాతోపాటు జాతీయ జెండాను ఎగురవేస్తారు.

  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా, స్వరాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్‌ కే దక్కుతుందన్నారు మాజీ సీఎం కేసీఆర్. ప్రజలిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నామని తెలిపారాయన. ఈ నేపథ్యంలో వచ్చిన దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో రాష్ట్ర, జిల్లా స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను వైభవంగా నిర్వహించాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు గులాబీ బాస్ కేసీఆర్. ఓవైపు ప్రభుత్వం. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇలా ఎవరికి వారే. రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహిస్తుండడం ఈసారి ప్రాధాన్యం సంతరించుకుంది.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్