కీరవాణి, చంద్రబోస్ లు అయిదవ భారతీయులు

Naatu Naatu oscar |ఇంతకు ముందు కేవలం నలుగురు భారతీయులు మాత్రమే ఈ ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు. ఇప్పుడు తెలుగు వారు అయిన కీరవాణి, చంద్రబోస్ అయిదవ భారతీయులుగా ఈ అవార్డు అందుకున్న వారిగా చరిత్ర సృష్టించారు. 95 ఏళ్ల చరిత్ర కలిగిన ఆస్కార్ అవార్డ్స్ లో ఇంతకు ముందు కేవలం నలుగురు అంటే నలుగురికి ఈ అవార్డు వచ్చింది. ఇప్పుడు ఈ అవార్డు అందుకున్న వారిలో కీరవాణి, చంద్రబోస్ లు వాళ్ళ తరువాత అయిదవ వారు. వారిద్దరూ తెలుగు వారు అవటం, తెలుగు జాతికే ఒక గర్వకారణం. మార్చి 13, 2023 భారతదేశ సినిమా చరిత్రలో ఒక నూతన అధ్యాయం నెలకొంది. అలాగే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కూడా. ఈరోజు భారత దేశానికి గర్వపడే రోజు.

‘ఆర్.ఆర్.ఆర్’ ఆస్కార్ నామినేషన్ లో వున్న దగ్గర నుంచి అందరి దృష్టి ఈ ‘ఆర్.ఆర్.ఆర్’ పైనే వుంది. అయితే ఉత్తమ నటుడు జూనియర్ ఎన్టీఆర్ నామినేషన్ లో ఉంటాడు అనుకుంటే, చివరికి ఈ సినిమాలో ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీ లో నామినేషలో చోటు సంపాదించింది. ఇక అప్పటి నుండి ఈ పాటకి ఆస్కార్ అవార్డు వస్తుంది అని అందరూ అనుకున్నారు. ప్రపంచం అంతా ఈ సినిమాకి దాసోహం అయింది. దర్శకుడు రాజమౌళి ప్రతిభని మెచ్చుకుంది. ప్రపంచంలోని అత్యుత్తమ దర్శకులు అయిన స్టీవెన్ స్పెల్ బెర్గ్ , జేమ్స్ కామెరూన్ లాంటి వారే రాజమౌళిని అతని సినిమాని మెచ్చుకున్నారు. ఇంతమంది మెచ్చుకున్నాక, ‘ఆర్.ఆర్.ఆర్’ కి ఆస్కార్ అవార్డు గ్యారంటీ అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఈసారి తెలుగువాడి జయకేతనం ఆస్కార్ లో వెలిగింది. మన తెలుగు, భారత పతాకం ఆస్కార్ లో ఎగిరింది. ఇంతకు ముందు భాను అతియా, రసూల్ పూకొట్టి, గుల్జార్, ఏ.ఆర్. రెహమాన్ ఈ ఆస్కార్ అవార్డులు అందుకున్నారు. 2009 లో సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ కి ‘జై హో’ సాంగ్ కి గాను ఆస్కార్ వచ్చింది. మళ్ళి ఇప్పుడు మన తెలుగు తేజాలు కీరవాణి, చంద్రబోస్ లు ఈ అవార్డును అందుకున్నారు.

Read Also: ‘RRR’ టీంకు ప్రశంసల వెల్లువ.. అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ

Follow us on:   Youtube   Instagram

Latest Articles

క్రిష్ ప్రయోగం ఫలించేనా..?

మంచి కథలు చెప్పాలని తపించే దర్శకుల్లో ఒకరు క్రిష్. ఈమధ్య వరుసగా ప్లాపులు రావడంతో కెరీర్లో బాగా వెనకబడ్డాడు. అనుష్కతో ఘాటీ సినిమా చేసిన తర్వాత ఇంత వరుకు క్రిష్ మూవీ ఎవరితో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్