Jabardasth Rakesh |జబర్దస్త్ కమెడియన్ రాకేశ్ ఓ ఇంటి వాడయ్యాడు. జోర్దార్ యాంకర్ సుజాతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. హైదరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాలులో శుక్రవారం ఉదయం వీరి వివాహం ఘనంగా జరిగింది. మంత్రి రోజా దంపతులు ముఖ్య అతిథిగా హాజరై ఇద్దరిని దీవించారు. వీరితో పాటు జబర్దస్ కమెడియన్లు, బుల్లితెర సెలబ్రెటీలు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా జబర్దస్ షో ద్వారా రాకేశ్ గుర్తింపు తెచ్చుకోగా.. తెలంగాణ యాసలో మాట్లాడుతూ జోర్దార్ షో ద్వారా సుజాత పాపులర్ అయ్యారు. అలాగే బిగ్ బాస్ షోలో కూడా పాల్గొని ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. జబర్దస్ షో ద్వారా వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. పెద్దల అంగీకారంతో నేడు వివాహం చేసుకున్నారు.
Jabardasth Rakesh | పెళ్లి బంధంతో ఒక్కటైన జబర్దస్త్ రాకేశ్- సుజాత
0
563
Latest Articles
ప్రభాస్.. షాకింగ్ అనౌన్స్ మెంట్..
బాహుబలి మూవీ ఓ చరిత్ర. ఒక కథను రెండు భాగాలుగా చెప్పచ్చు.. అలా చెప్పడం ద్వారా బ్లాక్ బస్టర్ సాధించవచ్చు.. అని నిరూపించింది దీంతో సీక్వెల్స్ ట్రెండ్ ఊపందుకుంది. స్టార్ హీరోలే కాదు.....
- Advertisement -
- Advertisement -


